జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్‌పై ED దాఖలు చేసిన పిటిషన్ సుప్రీంకోర్టులో సోమవారం విచారణకు రానుంది. భూకుంభకోణానికి సంబంధించి మనీలాండరింగ్ కేసులో హేమంత్‌కు జార్ఖండ్ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. దీనిని సుప్రీంకోర్టులో ED సవాల్ చేసింది. బెయిల్‌ను రద్దు చేయాలని కోరుతూ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. సుప్రీంకోర్టు న్యాయమూర్తులు బీఆర్ గవాయ్, కేవీ విశ్వనాథన్‌లతో కూడిన ధర్మాసనం ఈ పిటిషన్ విచారించనుంది.