జీహెచ్ఎంసీలో రాజకీయాలు వేడెక్కాయి. GHMCలో గురువారం సర్వసభ్య సమావేశం జరుగనుంది. ఫిబ్రవరి 11 తరువాత మేయర్, డిప్యూటీ మేయర్ పై అవిశ్వాసం పెట్టేందుకు BRS కసరత్తు చేస్తోంది. ఈ క్రమంలో GHMCలో మంగళవారం మేయర్ తో కాంగ్రెస్ కార్పొరేటర్ల సమావేశం నిర్వహించారు. GHMC కౌన్సిల్ సమావేశంలో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు. బుధవారం BRS అధిష్టానం ఆధ్వర్యంలో గ్రేటర్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేటర్ల సమావేశం జరుగనుంది.