కోల్‌కతాలో భారీ అగ్నిప్రమాదం.. దగ్ధమైన ఇళ్లు (వీడియో)

76చూసినవారు
పశ్చిమబెంగాల్‌ కోల్‌కతాలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. జెస్సోర్‌ రోడ్డులోని స్లమ్‌ ఏరియాలో శనివారం పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో చాలా ఇళ్లు అగ్నికి ఆహుతయ్యాయి. మంటలు పెద్ద ఎత్తున చెలరేగడంతో జెస్సోర్‌ ప్రాంతాన్ని దట్టమైన పొగ కమ్మేసింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని మంటలు ఆర్పివేసే ప్రయత్నం చేస్తున్నారు. ప్రాణ, ఆస్తి నష్టం వివరాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్