ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలకు నారు మడులు, నాటు వేసిన పొలాలు, పత్తి, అపరాలు సాగు చేసిన చెలకల్లో వర్షపు నీరు నిలిచింది. దీంతో వేసిన వరి పంటలు దెబ్బతినకుండా ఉండాలంటే జాగ్రత్తలు తీసుకోవాలి. వరి పంట వేసే నారుమడిలో ఎక్కువరోజులు నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలి. ఇప్పటివరకు నార్లు పోయని రైతాంగం, వర్షాలను సద్వినియోగం చేసుకొని పొలాలను దమ్ముచేసి వరి పంటను నేరుగా విత్తే పద్దతిలో విత్తుకోవడం వల్ల సమయం, పెట్టుబడి ఆదా చేసుకోవచ్చు.