గ్రూప్-2 పరీక్ష వాయిదా వేయాలని అభ్యర్థుల డిమాండ్ చేస్తుండటంతో ఏపీపీఎస్సీ కార్యాలయం దగ్గర పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. ఆందోళన మరింత ఉధృతం కాకుండా చర్యలు తీసుకుంటున్నారు. కొందరు పరీక్ష వాయిదా వేసినట్టు దుష్పచారం చేస్తున్నారని పోలీసులకు ఏపీపీఎస్సీ ఫిర్యాదు చేసింది. గ్రూప్-2 మెయిన్స్ పరీక్ష వాయిదా వేసేది లేదని ఏపీపీఎస్సీ చెప్పడంతో అభ్యర్థులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.