కోలీవుడ్ స్టార్ హీరో, టీవీకే పార్టీ అధినేత, దళపతి విజయ్ గొప్ప మనసు చాటుకున్నారు. ఫెంగల్ తుఫాను కారణంగా ఇబ్బందులు పడుతున్న బాధితులకు సాయం అందించారు. చెన్నైలో వర్షాలు, వరదల కారణంగా నష్టపోయిన 300 కుటుంబాలను పనయూర్‌లోని తన పార్టీ ప్రధాన కార్యాలయానికి పిలిపించారు. వారికి బియ్యం, దుస్తులు, నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. అనంతరం వారితో మాట్లాడి ధైర్యం చెప్పారు.