మెంతికూర సుగంధద్రవ్య పంటల్లో ఇదొకటి. ఈ పంట సాగుకు తక్కువ ఉష్ణోగ్రతలు అనుకూలం. ఇసుక నేలలు, నీరింకే ఒండ్రు భూములు మేలు. విత్తనాల్లో గుజరాత్ మెంతి-1, లాంసెలెక్షన్-1 రకాలు అనువైనవి. ఎకరాకు 6 నుంచి 10 కిలోల విత్తనాలు సరిపోతాయి. ఎకరాకు రూ.10-15 వేలు ఖర్చవుతుంది. విత్తిన తర్వాత 25 నుంచి 30 రోజుల్లో మొదటి కోత తీసుకోవచ్చు. పక్షం రోజులకోసారి చొప్పున మూడుసార్లు కోత కోయవచ్చు. దిగుబడి 40 క్వింటాళ్లకు పైగా వస్తుంది.