అతడి బౌలింగ్ ఇంగ్లాండ్ జట్టుకు మరింత బలం: బ్రెండన్ మెక్‌కలమ్

85చూసినవారు
అతడి బౌలింగ్ ఇంగ్లాండ్ జట్టుకు మరింత బలం: బ్రెండన్ మెక్‌కలమ్
ఇంగ్లాండ్ ఆటగాడు బెన్ స్ట్రోక్ ప్రస్తుతం బౌలింగ్ కు దూరంగా ఉన్నారు. గత ఏడాది స్టోక్స్ మోకాలికి శాస్త్ర చికిత్స జరగడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం ఇంగ్లాండ్, భారత జట్ల మధ్య టెస్ట్ సిరీస్ జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఇంగ్లాండ్ కోచ్ బ్రెండన్ మెక్‌కలమ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇండియా జట్టుతో జరిగే చివరి రెండు టెస్టుల్లో బెన్ స్టోక్స్ బౌలింగ్ చేస్తే జట్టు మరింత బలంగా మారుతుందని అభిప్రాయపడ్డారు. ఇప్పుడున్న పరిస్థితిలో పిచ్ పరిస్థితి అంచనా వేసి తుది నిర్ణయం తీసుకుంటామన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్