అంబేడ్కర్ జయంతిని పురస్కరించుకుని వచ్చే నెల 14న ప్రభుత్వ కార్యాలయాలకు కేంద్రం సెలవు ప్రకటించింది. ఈ మేరకు కేంద్రం ఒక ప్రకటన జారీ చేసింది. కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలతో పాటు ప్రభుత్వ రంగ పరిశ్రమలకు సెలవు ఉంటుందని వెల్లడించింది. కాగా, అదే రోజున తెలుగు రాష్ట్రాల్లోనూ పబ్లిక్ హాలిడే ఉండనుంది. స్కూళ్లు, కళాశాలలు, ప్రభుత్వ కార్యాలయాలు మూసివేయనున్నారు.