బడ్జెట్ ప్రవేశ పెట్టిన తర్వాత భారత్‌లో తగ్గిన బంగారం ధరలు ఇప్పుడు మళ్లీ పెరుగుతున్నాయి. మంగళవారం తెలుగు రాష్ట్రాల్లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.63,240 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ. రూ.70,739గా ఉంది. కిలో వెండి ధర రూ.88,900గా ఉంది. ఇక శ్రావణ మాసం, అందులో పెళ్లిళ్ల సీజన్ రానున్న నేపథ్యంలో ధరలు మరింత పెరిగే అవకాశముందని నిపుణులు చెబుతున్నారు.