స్వచ్ఛమైన నెయ్యిని వేడి చేసినప్పుడు అధిక వాసన వస్తుంది. కల్తీ నెయ్యిలో వాసన రాదు. అసలైన నెయ్యి లేత బంగారు పసుపు రంగులో ఉంటుంది. నెయ్యి స్వచ్ఛంగా ఉందా లేదా అనేది చెక్ చేయడానికి ఒక పాన్‌లో కొంచెం నెయ్యి వేసి వేడి చేయాలి. నెయ్యి అడుగున ఎలాంటి అవక్షేపాలు లేకపోతే స్వచ్ఛమైనది. అవక్షేపాలు ఉంటే కల్తీది. అసలైన నెయ్యిని ఫ్రిజ్‌లో ఉంచితే గడ్డకడుతుంది. గది ఉష్ణోగ్రత వద్ద ఉంచితే మృదువుగా మారుతుంది.