సర్వైకల్ క్యాన్సర్ రాకుండా జాగ్రత్త పడడం ఎలా?

84చూసినవారు
సర్వైకల్ క్యాన్సర్ రాకుండా జాగ్రత్త పడడం ఎలా?
బాలీవుడ్ నటి పూనమ్ పాండే దెబ్బకు సర్వైకల్ క్యాన్సర్ అంశం ఇప్పుడు దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఈ క్యాన్సర్ రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్త గురించి తెలుసుకుందాం.! లైంగిక ప్రక్రియలో పాల్గొన్న తర్వాత అసాధారణంగా రక్తస్రావం కనిపిస్తే జాగ్రత్తతీసుకోవాలి. మెనోపాజ్ దశ దాటిన వారిలో కూడా రక్తస్రావం కనిపించినా, నెలసరి అయిపోయాక మధ్యలో ఎప్పుడైనా అసాధారణంగా రక్తస్రావం అవుతే వెంటనే వైద్యులను సంప్రదించాలి. పొత్తికడుపు భాగంలో ఇబ్బందిగా అసౌకర్యంగా అనిపిస్తున్నా డాక్టర్ ని సంప్రదించి టెస్టులు చేయించుకోవాలి.

సంబంధిత పోస్ట్