ఛత్తీస్‌గఢ్‌లో శనివారం ఉదయం ఘోరం జరిగింది. బెమెతారా జిల్లా బెర్లా బ్లాక్‌లోని బోర్సీ గ్రామంలో గన్‌పౌడర్ తయారీ పరిశ్రమలో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 17 మంది దుర్మరణం పాలయ్యారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ఒక్కసారిగా పేలుడు సంభవించడంతో బిల్డింగ్ మొత్తం కుప్పకూలింది. దాంతో పరిశ్రమలో పనిచేస్తున్న కార్మికులంతా భవన శిథిలాల కింద చిక్కుకున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపడుతున్నారు.