హైతీ తీరంలో ఓడలో మంటలు చెలరేగడంతో పెను ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో కనీసం 40 మంది వలసదారులు మృతిచెందారని స్థానిక అధికారులను ఉటంకిస్తూ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ మైగ్రేషన్ (IOM) తెలిపింది. 80 మందికి పైగా వలసదారులతో కూడిన ఓడ బుధవారం హైతీ నుండి బయలుదేరి టర్క్స్ , కైకోస్‌కు బయలుదేరిందని IOM శుక్రవారం తెలిపింది. సమాచారం అందుకున్న హైతీ కోస్ట్ గార్డ్ 40 మందిని కాపాడినట్లు తెలుస్తోంది.