బ్లాంకెట్‌ ఫ్యాక్టరీలో భారీ అగ్ని ప్రమాదం(వీడియో)

74చూసినవారు
హరియాణలోని పానిపట్‌లో బుధవారం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. నగరంలోని బ్లాంకెట్‌ ఫ్యాక్టరీలో భారీగా మంటలు చెలరేగాయి. దాంతో అధికారులకు, అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. ఘటనాస్థలానికి చేరుకున్న అగ్నిమాపక యంత్రాలు మంటలను అదుపులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నాయి. అధికారులు సహాయ చర్యలను పర్యవేక్షిస్తున్నారు. ప్రాధమిక దర్యాప్తు అనంతరం ఈ ఘటనకు సంబంధించిన వివరాలు తెలుస్తాయని అధికారులు తెలిపారు.

సంబంధిత పోస్ట్