భర్తను కొట్టారని.. వైన్ షాప్ ముందు భార్య రచ్చరచ్చ (వీడియో)

80చూసినవారు
వైన్ షాప్ సిబ్బంది తన భర్తను కొట్టారని కోపోద్రిక్తురాలైన భార్య.. వారిపై దాడి చేసిన ఘటన HYD మధురానగర్ లో జరిగింది. ఓ వ్యక్తి మద్యం కొనేందుకు వైన్ షాప్ కు వెళ్లగా.. పేమెంట్ విషయంలో మాటామాటా పెరిగి సిబ్బంది అతడి తల పగులగొట్టారు. ఇంటికొచ్చిన భర్తను చూసి ఆగ్రహంతో భార్య వైన్ షాప్ వద్దకు వెళ్లి నిలదీసింది. సిబ్బందిపై దాడి చేసి, మందు బాటిళ్లను ధ్వంసం చేసింది. దీంతో పోలీసులు సిబ్బందితో పాటు మహిళపై కేసు నమోదు చేశారు.

సంబంధిత పోస్ట్