ప్రకాశం జిల్లాలో గులియన్ బారే సిండ్రోమ్ వైరస్ కలకలం రేపింది. కొమరోలు మండలం అలసందలపల్లిలో కమలమ్మ అనే వృద్ధురాలికి వైరస్ సోకడంతో ఆమెను ఆసుపత్రిలో చేర్పించారు. కమలమ్మకు తీవ్ర జ్వరంతో పాటు కాళ్లు చచ్చుబడిపోయాయని కుటుంబ సభ్యులు వెల్లడించారు. అప్రమత్తమైన పంచాయతీ అధికారులు గ్రామంలో శానిటైజేషన్ కార్యక్రమం చేపట్టారు.