AP: నంద్యాల జిల్లాలోని ఉయ్యాలవాడ మండలంలో విషాదం చోటుచేసుకుంది. నర్సిపల్లె గ్రామ కుందూ నదిలో గల్లంతు అయిన అష్రఫ్ అలీ(18) మృతదేహం బుధవారం లభ్యమైంది. ఉయ్యాలవాడకు చెందిన గజ ఈతగాళ్లు నదిలో చాలా సమయం కష్టపడి గాలించి, మృతదేహాన్ని గుర్తించి బయటకు వెలికితీశారు. మృతదేహాన్ని చూసి కుటుంబ సభ్యులు బోరున విలపించారు. ఈ ఘటనపై ఎస్ఐ వెంకటేశ్వర్లు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.