వైసీపీ మద్దతుదారుడు, సినీ నటుడు పోసాని కృష్ణమురళికి మరో షాక్ తగిలింది. ఆయన బెయిల్ పిటిషన్‌పై సీఐడీ కోర్టులో బుధవారం విచారణ జరిగింది. తనకు బెయిల్ మంజూరు చేయాలని పోసాని దాఖలు చేసిన పిటిషన్‌పై సీఐడీ కోర్టులో వాదనల అనంతరం పిటిషన్‌పై తీర్పును న్యాయస్థానం మార్చి 21కి వాయిదా వేసింది. చంద్రబాబు, పవన్ కల్యాణ్‌లపై గతంలో అనుచిత వ్యాఖ్యలు చేయడంతో పోసానిని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.