మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ పాట పాడి అలరించారు. గురువారం విధానసభ మానసరోవర్ ఆడిటోరియంలో ఫాగ్ మహోత్సవ్ కార్యక్రమం ఏర్పాటుచేశారు. ఈ కార్యక్రమంలో ఆ రాష్ట్ర మంత్రి కైలాష్ విజయవర్గియా, ఇతర నాయకులు డ్యాన్స్ చేస్తుండగా.. సీఎం మోహన్ యాదవ్ మైక్ తీసుకుని పాట పాడారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.