రామంతపూర్ లో ఓ వింత దొంగ ఉప్పల్ పోలీసులకు చిక్కాడు

73చూసినవారు
నగలు, బైకులు, డబ్బులు ఎత్తుకెళ్లే దొంగను చూశాం కానీ ఇంటి గేటు బయట విడిచిన బూట్లను ఎత్తుకెళ్తున్నాడు ఈ వింత దొంగ. రామంతపూర్ వాసవి నగర్ లో మల్లేష్ రేణుక గత కొంత కాలం నుండి నివాసం ఉంటున్నారు. గత రెండు నెలల నుండి సుమారుగా 100 ఇండ్ల వరకు పైగా దొంగతనం చేసి వెయ్యి బూట్లను ఎత్తుకెళ్లాడు. ఈ వింత దొంగ పై నిఘా ఉంచి కాలనీవాసులు గురువారం అతన్ని పట్టుకున్నారు. ఉప్పల్ పోలీసులకు అప్పగించగా కేసు నమోదు చేసారు.

సంబంధిత పోస్ట్