హైదరాబాద్ ను ముందే ఎండాకాలం పలకరించాయి. ఉదయం 10 గంటల నుంచి విచే వేడిగాలులకు నగరవాసులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఈ నేపథ్యంలో పేదవారి ప్రిడ్జ్ అయిన మట్టి కుండలకు గిరాకీ పెరిగింది. మట్టి కుండల విక్రయాలు జోరందుకున్నాయని వ్యాపారులు చెబుతున్నారు. కుండ వ్యాపారులు మాట్లాడుతూ. మట్టి కుండలోని నీరు చల్లగా ఉండడమే గాక, ఆరోగ్యానికి సైతం మేలు చేస్తాయని చెబుతున్నారు. ఎటు చూసినా రోడ్లమీద మట్టి కుండలు దర్శనం ఇస్తున్నాయి.