పెద్దఅంబర్‏పేట్: పారిశుద్ధ్య సిబ్బందికి కౌన్సిలర్ అనురాధ సురేష్ దసరా కానుకలు

52చూసినవారు
పెద్దఅంబర్‏పేట్: పారిశుద్ధ్య సిబ్బందికి కౌన్సిలర్ అనురాధ సురేష్ దసరా కానుకలు
మున్సిపాలిటీని పరిశుభ్రంగా ఉంచడంలో పారిశుద్ధ్య కార్మికులది కీలక పాత్ర అని పెద్దఅంబర్‏పేట్ 5వ వార్డు కౌన్సిలర్ బొర్ర అనురాధ సురేష్ అన్నారు. దసరా పండుగ సందర్భంగా పారిశుద్ధ్య కార్మికులకు ఆదివారం చీరలు, దుస్తులు పంపిణీ చేశారు. ప్రతి సంవత్సరం దసరా, దీపావళికి తమ వంతు సహాయంగా పారిశుద్ధ్య కార్మికులకు, పలువురు మున్సిపల్ సిబ్బందికి సొంత డబ్బులతో దుస్తులు అందజేస్తున్నామని కౌన్సిలర్ బొర్ర అనురాధ సురేష్ తెలిపారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్