మంచినీటి సరఫరా సమస్యలను త్వరలోనే పరిష్కరిస్తామని శాలిబండ డివిజన్ కార్పొరేటర్ ముస్తఫా అలీ ముజఫర్ అన్నారు. గురువారం వాటర్ వర్క్స్ అధికారులతో కలిసి డివిజన్లో కార్పొరేటర్ పర్యటించారు. మంచినీటి సరఫరాకు సంబంధించి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రధానంగా లో వాటర్ ఫ్రెజర్ సమస్యలు ఉన్నాయని, అవసరం ఉన్నంత మేరకు మంచినీటి సరఫరా జరగడం లేదని స్థానికులు తెలిపారు. వెంటనే చర్యలు తీసుకోవాలని అధికారులను కార్పొరేటర్ ఆదేశించారు.