రాంకీ, జీహెచ్ఎంసీ శానిటేషన్ సిబ్బందిపై ఇటీవల సర్వత్ర విమర్శలు ఎదురవుతున్నాయి. తాజాగా చాంద్రాయణగుట్ట డివిజన్ పరిధిలోని ఇందిరానగర్ లో రోడ్డు పక్కనే చెత్త పేరుకుపోయింది. రాంకీ సిబ్బంది ప్రతిరోజూ చెత్తను క్లియర్ చేయకపోవడంతో గుట్టలుగా పేరుకుపోయింది. వీధి కుక్కలతో పాటు ఇతర జంతువులు వచ్చి మరింత అపరిశుభ్రంగా మారుస్తున్నాయి. వెంటనే చెత్తను క్లియర్ చేయాలని స్థానిక కాలనీవాసులు కోరుతున్నారు.