నగరంలో పలు చోట్ల వాహనదారులు ఇష్టానుసారంగా వాహనాలు రోడ్డుపై పార్కింగ్ చేస్తుండడంతో ఇతర వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. తాజాగా చాంద్రాయణగుట్ట పోలీస్ స్టేషన్ ముందున్న రోడ్డుపై ఓ వ్యక్తి తన ఆటోని పార్క్ చేసి వెళ్ళాడు. రోడ్డు ఇరుకుగా మారడంతో ఇతర వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని వాహనదారులు కోరుతున్నారు.