ఓల్డ్ సిటీ కాంగ్రెస్ నాయకులపై మాజీ ఎంపీ హనుమంతరావు పైర్ అయ్యారు. ఓల్డ్ సిటీ కాంగ్రెస్ నాయకులతో టీపీసీసీ చీప్ మహేష్ కుమార్ గౌడ్ అధ్యక్షతన బుధవారం సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో విహెచ్ మాట్లాడారు. ఇప్పటివరకు ఓల్డ్ సిటీలో కాంగ్రెస్ ఒక్క సీటు కూడా గెలవలేదు. ఇవాళ మీటింగ్ కు వచ్చి పెద్ద మాటలు మాట్లాడుతున్నారంటూ విహెచ్ పైర్ అయ్యారు. ఈసారి నేనే ఓల్డ్ సిటీకి వచ్చి మీ సంగతేంటో చూస్తానంటూ వార్నింగ్ ఇచ్చారు.