అంబర్ పేట లో బీజేపీ నేతల మూసీ నిద్ర
మూసీ ప్రక్షాళన చేయండి కానీ పేదల ఇళ్లు కూలగొట్టకండి అనే నినాదంతో మూసీ పరీవాహక ప్రాంతాల్లో బీజేపీ నేతలు నిద్ర చేస్తున్నారు. కిషన్ రెడ్డి, కె. లక్ష్మణ్, ఈటల రాజేందర్‌తో పాటు మరి కొంతమంది నేతలు వేర్వేరు చోట్ల బాధితులతో ముచ్చటించారు. అంబర్‌పేట నియోజకవర్గంలోని తులసిరాం నగర్ బస్తీలో కిషన్ రెడ్డి, ఎల్బీ నగర్ నియోజకవర్గంలో శనివారం ఈటల రోడ్డుపై బైఠాయించి బాధితులకు మద్దతు తెలిపారు.