సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో శుక్రవారం నాంపల్లి కోర్టుకు అల్లు అర్జున్ వెళ్లనున్నారు. ఈ కేసులో ఆయనకు నాంపల్లి కోర్టు 14 రోజులు రిమాండ్ విధించిన విషయం తెలిసిందే. దీంతో ఆయన మధ్యంతర బెయిల్‌పై బయటకు వచ్చారు. నిన్నటితో రిమాండ్ గడువు ముగిసింది. ఇవాళ కోర్టులో విచారణ జరగనుంది. ఈ నేపథ్యంలో బన్నీ కోర్టుకు వెళ్లనున్నారు.