బండి సంజయ్ కు హైకోర్టులో ఊరట

53చూసినవారు
బండి సంజయ్ కు హైకోర్టులో ఊరట లభించింది. ఈ నెల 11 వరకు ఆయనను అరెస్ట్ చేయొద్దని బుధవారం హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. విచారణ చేయాల్సి వస్తే సీఆర్పీసీ 41 నోటీసు ఇవ్వాలని స్పష్టం చేసింది. కాగా మార్చ్ 27న చెంగిచర్లలో హిందూ, ముస్లిం వర్గాల మధ్య జరిగిన గొడవలో గాయపడిన వారిని పరామర్శించేందుకు సంజయ్ వెళ్లగా పోలీసులు అనుమతించలేదు. ఆ సమయంలో పోలీసుల విధులకు ఆటంకం కలిగించారని ఆయనపై కేసు నమోదైంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్