దూల్ పేట్ లో 2 కేజీల గంజాయిని ఎక్సైజ్ పోలీసులు గురువారం పట్టుకున్నారు. రాజేందర్ సింగ్ ఇంట్లో ఎక్సైజ్ పోలీసులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించగా 2. 014 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. గంజాయి అమ్మకాలు చేస్తున్న రాజేందర్ సింగ్ విక్కిని అరెస్ట్ చేశారు. వారి నుంచి సెల్ ఫోన్స్, స్కూటిని స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసుకు సంబంధించి మరో ముగ్గురు పరారీలో ఉన్నారు.