జానీ మాస్టర్ తన సోషల్ మీడియాలో ఎమోషనల్ వీడియో

62చూసినవారు
జానీ మాస్టర్ తన సోషల్ మీడియాలో ఎమోషనల్ వీడియో
రేప్ కేసులో అరెస్టై 37 రోజులు జైలు శిక్ష అనుభవించి నిన్ననే బెయిల్ మీద విడుదలైన జానీ మాస్టర్ తన సోషల్ మీడియా వేదికగా ఒక ఎమోషనల్ వీడియో షేర్ చేసుకున్నారు. ఈ రోజు సాయంత్రం 7:00 ఎనిమిది నిమిషాలకు ట్విట్టర్ ఖాతా నుంచి ఈ వీడియో పోస్ట్ చేశారు. నా కుటుంబం శ్రేయోభిలాషుల ప్రార్థనలే నన్ను ఇక్కడికి తీసుకొచ్చాయి. నిజం కాస్త ఆలస్యమైనా తెలుస్తుంది. ఏదో ఒక రోజు నిజాయితీ గెలుస్తుంది. నా కుటుంబం ఇన్ని రోజులు ఏ ఇబ్బందులు అయితే పడిందో వాటి వల్ల నా గుండె ఎప్పటికీ ఆ బాధను అనుభవిస్తూనే ఉంటుంది అంటూ జానీ మాస్టర్ వీడియో షేర్ చేశారు.

సంబంధిత పోస్ట్