సంక్రాంతి పండుగ వేళ మంగళవారం హైదరాబాద్ మహానగర ప్రజలకు గోషామహల్ నియోజకవర్గం బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ శుభాకాంక్షలు తెలిపారు. అలాగే పిల్లల తల్లిదండ్రులకు రాజాసింగ్ కీలక రిక్వెస్ట్ చేస్తూ పతంగుల ఉత్సవంలో అవాంఛనీయ ఘటనలు నివారించేందుకు పిల్లలతో పాటే ఉండాలని, చైనా మాంజాలను ఉపయోగించకుండా చూడాలని, కరెంట్ షాక్ ప్రమాదాల నుంచి జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. భద్రంగా పండుగను జరుపుకోవాలని రాజాసింగ్ కోరారు.