హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థిపై మోదీ ప్రశంసలు

1014చూసినవారు
హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థిపై మోదీ ప్రశంసలు
హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలతపై ప్రధాని మోదీ ప్రశంసలు కురిపించారు. ఆమె ఇటీవల ఓ జాతీయ మీడియా నిర్వహించిన చర్చా కార్యక్రమంలో పాల్గొని తన అభిప్రాయాలు వ్యక్తం చేశారు. దీనిపై మోదీ స్పందించారు. “మాధవీలతా జీ. మీ ‘ఆప్కే అదాలత్' ఎపిసోడ్ అద్భుతంగా ఉంది. చాలా కీలక అంశాలను మీరు ఇందులో లేవనెత్తారు. మీకు నా శుభాకాంక్షలు” అంటూ ఆదివారం మోదీ ఎక్స్ లో పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్