హైదరాబాద్ లో కాల్ సెంటర్ స్కాం వెలుగుచూసింది. అమెరికాకు చెందిన పే పాల్ కస్టమర్స్ డేటా చోరీ చేసి స్కాం చేసినట్లు తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో గుర్తించింది. విదేశాల్లో ఉంటున్న కస్టమర్స్ ను టార్గెట్ చేసుకుని స్కాం చేస్తున్నట్లు తేలింది. బుధవారం కాల్ సెంటర్ పై రైడ్ చేసి ఇప్పటివరకు 63 మందిని అరెస్ట్ చేశారు. గుట్టు చప్పుడు కాకుండా సైబర్ నేరగాళ్లు కాల్ సెంటర్ నిర్వహిస్తున్నారు.