యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో జరుగనున్న సుదర్శన లక్ష్మీనారసింహ దివ్యస్వర్ణ విమాన గోపుర మహా కుంభాభిషేక మహోత్సవంకు సీఎం రేవంత్ రెడ్డిని అధికారికంగా ఆహ్వానించారు. మంత్రి కొండ సురేఖ, సీఎస్ శాంతి కుమారి, ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య, దేవాదాయ శాఖ కార్యదర్శి శైలజా రామయ్యర్, ఆలయ ఈవో, అర్చకులు ముఖ్యమంత్రిని కలిసి గురువారం జూబ్లీహిల్స్ నివాసంలో నిమంత్రణ అందజేశారు.