సంధ్య ధియేటర్ వద్ద తొక్కిసలాట ఘటనలో అరెస్ట్ అయిన అల్లు అర్జున్ నివాసానికి మెగాస్టార్ చిరంజీవి భార్య సురేఖతో కలిసి చేరుకున్నారు. తన సినిమా షూటింగ్ ను రద్దు చేసుకుని హుటాహుటిన బన్నీ ఇంటికి చేరుకున్నారు. ఇంట్లో ఉదయం నుంచి జరిగిన పరిస్థితిపై అరా తీశారు. భార్య సురేఖతో కలిసి అల్లు అర్జున్ భార్య, తల్లి ఇతర కుటుంబ సభ్యులకు చిరంజీవి ధైర్యం చెప్పారు.