నూతన సంవత్సరం మొదటి రోజున బంజారాహిల్స్ లోని ప్రసిద్ధ పూరీ జగన్నాథ్ ఆలయం భక్తులతో కిటకిటలాడింది. తెల్లవారుజాము నుంచే భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. పూజారులు ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఆలయ ప్రాంగణం అంతా భక్తుమయంగా మారింది. ఆలయ పార్కింగ్ సదుపాయం ఏర్పాట్లు, భక్తుల కోసం ఆలయ నిర్వాహకులు అన్ని ఏర్పాట్లను చేశారు.