బాలికపై అసభ్యంగా ప్రవర్తించిన ట్యూషన్ మాస్టర్

57చూసినవారు
బాలికపై అసభ్యంగా ప్రవర్తించిన ట్యూషన్ మాస్టర్
ఫిల్మ్ న‌గ‌ర్‌లో లైంగిక వేధింపుల ఘ‌ట‌న‌ ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ట్యూషన్‌కి వెళ్లిన 10వ తరగతి బాలికపై ట్యాష‌న్ మాస్ట‌ర్ రాములు అసభ్యంగా ప్రవర్తించాడు. బాలిక ప్రైవేట్ పార్ట్స్ తాకుతూ రాములు అసభ్యంగా ప్రవర్తించ‌టంతో బాధితురాలు ఈ విషయం గురించి త‌న త‌ల్లికి చెప్పింది. విష‌యం తెలుసుకున్న త‌ల్లి బుధ‌వారం ఫిల్మ్ న‌గ‌ర్ పోలీస్ స్టేష‌న్‌లో రాములుపై ఫిర్యాదు చేసింది. అయితే ఈ ఘ‌ట‌న‌లో పోలీసులు ఇంత‌వ‌రుకూ ఎలాంటి చ‌ర్య‌లు తీసుకోలేద‌ని స‌మాచారం.

సంబంధిత పోస్ట్