తెలంగాణ ఇరిగేషన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ గా మువ్వ విజయ్ బాబు ఆదివారం హైదరాబాద్ బంజారాహిల్స్ రోడ్ నంబర్ 13లోని సంస్థ కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. ఆయన ప్రమాణ స్వీకార కార్య క్రమంలో పార్టీ శ్రేణులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి విజయ్ బాబుకు శుభాకాంక్షలు తెలిపారు. కుటుంబ సభ్యులు పుష్పగుచ్ఛాలు అందించి శుభాకాంక్షలు తెలిపారు.