మయన్మార్‌లో శుక్రవారం మధ్యామ్నం సంభవించిన భూకంపంలో మృతుల సంఖ్య 87కు చేరుకుంది. భూకంపం ధాటికి మయన్మార్ లోని అనేక భవనాలు, ఆసుపత్రులు కుప్పకూలాయి. దీంతో వందల సంఖ్యలో మరణించారు. ఇంక అనేక మంది శిథిలాల కింద చిక్కుకుపోయారు. దీంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. కాగా మయన్మార్‌లో మరణించిన మృతులకు ప్రధాని మోదీ సంతాపం వ్యక్తం చేశారు.