ప్రజలకు మౌలిక వసతులు కల్పించడం ఎంఐఎం లక్ష్యమని కార్వాన్ ఎమ్మెల్యే కౌసార్ మొహియుద్దీన్ అన్నారు. గురువారం నానల్ నగర్ డివిజన్ పరిధిలో ఎమ్మెల్యే పర్యటించారు. డివిజన్ పరిధిలోని డ్రీమ్ వెల్ఫేర్ కాలనీలో నూతనంగా నిర్మించిన రోడ్డుని ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ. సమస్యలను పరిష్కరించేందుకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటామన్నారు. స్థానిక వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు ఎమ్మెల్యేను సన్మానించారు.