గచ్చిబౌలి ఉర్దూ యూనివర్సిటీలో ఉద్రిక్తత

57చూసినవారు
గచ్చిబౌలిలోని ఉర్దూ యూనివర్సిటీలో శుక్రవారం తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పురుగుల అన్నం పెడుతున్నారని విద్యార్థులు ఆందోళనకు దిగారు. యూనివర్సిటీ యాజమాన్యానికి పలుమార్లు ఫిర్యాదు చేసిన పట్టించుకోవడం లేదని, సుమారు 400 మంది విద్యార్థులు ధర్నాకు దిగారు. పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. పురుగుల అన్నం పెడుతున్న యాజమాన్యం పై చర్యలు తీసుకోవాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్