ఖైరతాబాద్ లో ఘనంగా గంగ తెప్పోత్సవ ర్యాలీ

61చూసినవారు
తెలంగాణ గంగ తెప్పోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ఖైరతాబాద్ నియోజకవర్గం తుమ్మలబస్తిలో ఉన్న గంగ మాత ఆలయంలో ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన ర్యాలీలో ఆయన పాల్గొన్నారు. స్థానిక కమిటీ సభ్యులు ఎమ్మెల్యేను శాలువాతో సన్మానించి సత్కరించారు. గంగపుత్రులందరికి తెప్పోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.

సంబంధిత పోస్ట్