టీపీసీసీ నూతన అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ ను గురువారం రవీంద్ర భారతిలో కాంగ్రెస్ మాజీ ఎంపీ విహెచ్ హనుమంతరావు అధ్యక్షతన రాష్ట్ర ఓబీసీ సంఘాలచే ఘన సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మంత్రులు పొన్నం ప్రభాకర్, సీతక్క హాజరయ్యారు. వీరితో పాటు ప్రభుత్వ సలహాదారు కే కేశవరావు, ఎమ్మెల్సీలు అమీర్ అలీ ఖాన్, ఎగ్గే మల్లేశం, ఎమ్మేల్యేలు ఆది శ్రీనివాస్, విర్లపల్లి శంకర్ తదితరులు పాల్గొన్నారు.