పార్కింగ్ స్థలం లో వుంచిన ద్విచక్ర వాహనం మంటలకు ఆహుతి

50చూసినవారు
పంజాగుట్ట పోలిస్ స్టేషన్ బయట పార్కింగ్ స్థలం లో వుంచిన ద్విచక్ర వాహనం మంటలకు ఆహుతి అయ్యింది. వాహనం ఎలా అగ్ని ప్రమాదానికి గురైంది అన్న విషయం పై లేని స్పష్టత. మరో ద్విచక్ర వాహనం కూడా పాక్షికంగా దగ్ధమైంది. సమాచారం మేరకు అగ్నికి ఆహుతి అయిన వాహనం టి ఎస్ 11 ఈ జడ్ 6257 గా పోలీసులు గుర్తించారు. అంబర్ పేట కి చెందిన మహ్మద్ హమీద్ గా గుర్తించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్