అల్లు అర్జున్ అరెస్ట్ పై ఎమ్మెల్యే దానం నాగేందర్ శనివారం స్పందించారు. అల్లు అర్జున్ అరెస్ట్ బాధాకరమని, కోర్టు బెయిల్ ఇవ్వడం సంతోషకర పరిణామమని అన్నారు. తెలుగులోనే కాకుండా దేశవ్యాప్తంగా అల్లు అర్జున్ పేరు తెచ్చుకున్నారు. అటువంటి హీరోను ఆరెస్ట్ చేయడం పట్ల చింతిస్తున్నాను. సంధ్య ధియేటర్ వాళ్ళు ముందుగానే పర్మిషన్ తెచ్చుకున్నామని చెప్పారు. చివరికి కోర్టు బెయిల్ ఇచ్చింది అంటూ దానం నాగేందర్ వెల్లడించారు.