కుబేర టైటిల్ పై వివాదం నెలకొంది. ఆ టైటిల్ తమదేనంటూ త్రిశక్తి ఎంటర్ప్రైజెస్ ప్రొడ్యూసర్ నరేందర్ తెలిపారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో శనివారం విలేకరుల సమావేశంలో న్యాయవాది రాజేష్, కో ప్రొడ్యూసర్లు రజనీకాంత్ లతో కలిసి మాట్లాడారు. అన్ని అనుమతులు పొందిన కుబేర టైటిల్ ను కాపీ చేసి ఇప్పుడు కుబేర టైటిల్ కు ముందు శేఖర్ కమ్ముల అని పెట్టడం ఏమిటని ప్రశ్నించారు. ఇది తమకు తీవ్రంగా నష్టం చేస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు.