హైదరాబాద్ బీఆర్కే భవన్ లో రాష్ట్రంలోని సీడ్ కంపెనీల ప్రతినిధులతో రైతు కమిషన్ సమావేశమైంది. ఈ సమావేశంలో సీడ్ కంపెనీలు విత్తన తయారీలో ఎదుర్కొంటున్న సవాళ్లపై చర్చించారు. ఈ సమావేశంలో రైతు కమిషన్ చైర్మన్ కోదండ రెడ్డి, సభ్యులు కేవిఎన్ రెడ్డి, రాంరెడ్డి గోపాల్ రెడ్డి, భవానీ రెడ్డి, రాములు నాయక్, గడువు గంగాధర్, సీడ్ కార్పొరేషన్ చైర్మన్ అన్వేష్ రెడ్డి, సీడ్ కంపెనీల ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.