అత్యవసర సమయంలో సీఎంఆర్ఎఫ్ ఎంతగానో ఉపయోగపడుతుందని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అన్నారు. శనివారం తన క్యాంపు కార్యాలయంలో లబ్ధిదారులకు మంజూరైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను ఎమ్మెల్యే పంపిణీ చేశారు. సిఎంఆర్ఎఫ్ ద్వారా కార్పొరేట్ వైద్య సేవలను ఉచితంగా పొందేందుకు అవకాశం ఉంటుందన్నారు. అర్హులైన వారు సీఎంఆర్ఎఫ్ కు దరఖాస్తు చేసుకుని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు, కార్యకర్తలు పాల్గొన్నారు.